Gollaprolu: గొల్లప్రోలులో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ 31 వాహనాలు స్వాధీనం!
Gollaprolu: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 31 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Gollaprolu: గొల్లప్రోలులో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ 31 వాహనాలు స్వాధీనం!
Gollaprolu: గొల్లప్రోలు పట్టణంలోని ఈబీసీ కాలనీలో ఈరోజు పిఠాపురం సీఐ జి.వి.వి. సత్యనారాయణ, గొల్లప్రోలు ఎస్ఐ ఎన్. రామకృష్ణ, ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసు సిబ్బంది, రిక్రూట్ పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సరైన రికార్డులు లేని 31 మోటారు వాహనాలను గుర్తించి, తదుపరి ధృవీకరణ మరియు చట్టపరమైన చర్యల నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఆవరణలో త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం, మహిళల భద్రత, రహదారి భద్రతా నియమాల పాటింపు, అక్రమ కార్యకలాపాల నివారణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.




