Pithapuram: 81 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంతంగా ముగిసిన SMC ఎన్నికలు
Pithapuram: పిఠాపురం మండల పరిధిలోని 81 ప్రభుత్వ పాఠశాలల్లో SMC ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రతి పాఠశాలలో చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకున్నారు.
Pithapuram: 81 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంతంగా ముగిసిన SMC ఎన్నికలు
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం... పిఠాపురం మండలంలోని అర్బన్ రూరల్ కలిపి 81 ప్రభుత్వ పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగినవి. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ప్రశాంతమైన రీతిలో ఎస్ఎంసి కమిటీ ఎన్నికలలో భాగంగా ప్రతి పాఠశాలలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగినది.
వీటితోపాటు ప్రతి పాఠశాలలో 12 లేక 15 మంది సభ్యులు పేరెంట్స్ నుంచి ఎన్నుకోబడినారు మరియు స్థానిక ప్రజాప్రతినిధుల నుండి ఒకరు లేక ఇద్దరు, ఉపాధ్యాయుల నుండి ఒకరు లేక ఇద్దరు, ఫ్రంట్ లైన్స్ వర్కర్స్ నుండి ఒకరు లేక ఇద్దరు కమిటీలో సభ్యులు ఎన్నిక కాబడినారు.
మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బందోబస్తు ఏర్పాటు చేయగా ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో మండల విద్యాశాఖ అధికారుల ( రాగం పాదాలు ఎంఈఓ -1 మరియు కేటి నారాయణదాసు ఎంఈఓ 2 ) పర్యవేక్షణలో ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో జరిగిన. ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరి పేరెంట్ కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా సోదరులు అందరూ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




