Pithapuram: పిఠాపురం రెండవ విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తుపై సమీక్ష

Pithapuram: నవంబర్ 29న పిఠాపురం మండలంలో జరగనున్న రెండవ విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై కాకినాడ SDPO ఎన్.వి.ఎస్.కె. దుర్గారావు సమీక్ష నిర్వహించారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 27 Nov 2026 10:12 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం రెండవ విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తుపై సమీక్ష

పిఠాపురం: పిఠాపురం మండలంలో ఈ నెల 29.11.2026 తేదీన జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎన్.వి.ఎస్.కె. దుర్గారావు పిఠాపురం సర్కిల్ కార్యాలయంలో పిఠాపురం సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 26.11.2026 తేదీన జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలు, సమస్యలు, లోటుపాట్లను సమీక్షించి, రెండవ విడత ఎన్నికల్లో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులు, ఎన్నికల అల్లరి మూకలు, రౌడీషీటర్లను ముందుగానే గుర్తించి, వారిపై నిరంతరం నిఘా ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఆయా ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మరియు రిజర్వ్ సిబ్బందిని అవసరానికి అనుగుణంగా వినియోగించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, అవసరమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని, తగినంత విద్యుత్ వెలుతురు, లైటింగ్ మరియు ఇతర మౌలిక భద్రతా ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను అప్రమత్తంగా, సమన్వయంతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆదేశించారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram