Pithapuram: పిఠాపురంలో ప్రశాంత ఎన్నికల కోసం పోలీసుల భారీ రూట్ మార్చ్!
Pithapuram: పిఠాపురంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల భారీ రూట్ మార్చ్. ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించేందుకు అధికారులు ముందస్తు చర్యలు.
Pithapuram: పిఠాపురం పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సర్కిల్ ఎస్‌ఐ మరియు పోలీసు సిబ్బందితో కలిసి పిఠాపురం పట్టణంలో రూట్ మార్చ్ నిర్వహించారు.
ఈ రూట్ మార్చ్ రథాల పేట నుంచి ప్రారంభమై ఉప్పాడ రోడ్ సెంటర్, మార్కెట్ సెంటర్, చర్చి సెంటర్, అగ్రహారం, రమా థియేటర్ సెంటర్ మీదుగా స్టువర్ట్‌పేట వరకు కొనసాగింది.
మున్సిపల్ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రూట్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.




