Pithapuram: ఉప్పాడ సెంటర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన
Pithapuram: పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో పోలీసులు హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.
Pithapuram: ఉప్పాడ సెంటర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన
పిఠాపురం: కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కాకినాడ అడ్మిన్ ఏఎస్పీ మహంతి కిషోర్ కుమార్ సూచనలతో, పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.వి.వి. సత్యనారాయణ పర్యవేక్షణలో స్థానిక ఉప్పాడ సెంటర్ వద్ద హెల్మెట్ అవగాహన డ్రైవ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్ అదనపు ఎస్‌ఐ లొకేష్ మరియు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న యువతకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించి, “హెల్మెట్ ధారణ – ప్రాణాలకు రక్షణ” అనే సందేశాన్ని వివరించారు. హెల్మెట్లు కొనుగోలు చేసి తప్పనిసరిగా ధరించి ప్రయాణించాలని సూచించారు.
పిఠాపురం పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చేపడుతున్న ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలని సీఐ జి.వి.వి. సత్యనారాయణ కోరారు.




