Pithapuram: ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణే లక్ష్యం: పిఠాపురం పోలీసులు!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పిఠాపురం పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు.
Pithapuram: ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణే లక్ష్యం: పిఠాపురం పోలీసులు!
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, రాబోయే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పిఠాపురం సర్కిల్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా యు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అతి సమస్యాత్మక ప్రాంతమైన శ్రీరాంపురం గ్రామంలో ఈ రోజు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశాన్ని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ G.V.V. సత్యనారాయణ , యు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ G. వెంకటేష్ తో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, పోలీసుల భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు.
ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా కుల, మత, వర్గాలకు అతీతంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు మరియు గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.




