Pithapuram: పిఠాపురంలో ఘనంగా పితృదేవతల కృతజ్ఞతా కార్యక్రమం!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నిధులతో చేపట్టిన పితృదేవతల కృతజ్ఞతా కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలంలో అన్న సమారాధన నిర్వహించారు.
Pithapuram: పిఠాపురంలో ఘనంగా పితృదేవతల కృతజ్ఞతా కార్యక్రమం!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం...కొత్తపల్లి మండలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో పితృపక్షాల సందర్భంగా పితృదేవతలకు కృతజ్ఞతలు సమర్పించే కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గంలో 14 రోజుల పాటు 13 ఆలయాల్లో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలంలోని అమీనాబాద్ పోలేరమ్మ ఆలయం, గోర్స రామాలయం వద్ద ఈరోజు మొదటి రోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, స్థానిక ప్రజలకు అన్నప్రసాదాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పాడ–కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్‌చార్జ్ రావు అక్షయ్ , జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ , ఆయా గ్రామాల ఇన్‌చార్జులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




