Pithapuram: పిఠాపురం చిన్నారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక భరోసా!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు చిన్నారి వైద్యం కోసం మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, రూ. 2 లక్షల సొంత నిధులు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

V. Ramakrishna, Pithapuram
Published on: 14 Oct 2026 5:41 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం చిన్నారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక భరోసా!

పిఠాపురం: చేబ్రోలు గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ్ కుమారుడు చందక వీరనాగదుర్గ యాదవ్ గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో చిన్నారికి విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

చిన్నారి చికిత్సకు మొత్తం రూ. 9 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు అంచనా వేయగా, తొలుత రూ. 2.5 లక్షలకు మాత్రమే లోకల్ కాంపిటెంట్ అథారిటీ (LOC) ద్వారా ఆర్థిక అనుమతి లభించింది. మిగిలిన చికిత్స ఖర్చులను భరించడం బాధిత కుటుంబానికి కష్టంగా మారిన విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది.

వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యంతో స్వయంగా మాట్లాడి, చికిత్స ఖర్చులో రాయితీలు కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో చిన్నారికి విజయవంతంగా చికిత్స అందించగా, చిన్నారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

అయితే, చికిత్సకు సంబంధించి మిగిలిన ఖర్చులను సమకూర్చుకోవడంలో కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. తన సొంత నిధుల నుంచి రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయలను) 13.10.2026న నగదు రూపంలో చిన్నారి చందక వీరనాగదుర్గ యాదవ్‌కు అందజేశారు.

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, చికిత్స ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు తన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram