Pithapuram: పిఠాపురం పాదగయ హుండీ ఆదాయం రూ.26.76 లక్షలు!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో 80 రోజులకు గాను రూ.26,76,188 హుండీ ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో తెలిపారు.
Pithapuram: పిఠాపురం పాదగయ హుండీ ఆదాయం రూ.26.76 లక్షలు!
పిఠాపురం: శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం(పాదగయ) వారి హుండీ లెక్కింపు కార్యక్రమం కాకినాడ జిల్లా దేవదాయ శాఖ అధికారి కే. ఎల్.సుధారాణి , కార్యనిర్వహణాధికారులు బి.వి. ఆర్. చౌదరి, యం.వీరభద్రరావు పర్యవేక్షణలో ఆలయ సహాయ కమీషనరు & కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మరియు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చాగంటి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ ఏసీ & ఈవో మాట్లాడుతూ ది.18.08.2026 నుండి ది.05.11.2026 వరకు 80 రోజులకుగాను ఆలయ హుండీల ద్వారా 26,76,188/- రూపాయిలు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, అర్చకులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.




