Pithapuram: కుక్కుటేశ్వర స్వామి, పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక పూజలు!
Pithapuram: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు.
Pithapuram: కుక్కుటేశ్వర స్వామి, పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక పూజలు!
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ క్షేత్రంలో మొదటి కార్తీక సోమవారం సందర్భంగా పోతెత్తిన భక్తులు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అష్టాదశ శక్తి పీఠాల్లో పదో శక్తి పీఠమైన పురోహితిక అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకున్నారు .
పవిత్ర పాదగయ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి ,పురుహూతిక స్వామి అమ్మవార్లను దర్శించుకుంన్నారు. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండటంతో క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.




