Pithapuram: పిఠాపురం ఎంపీపీగా వీరంరెడ్డి అమరేశ్వరరావు ఎన్నిక
Pithapuram: పిఠాపురం మండల పరిషత్ ఎంపీపీగా వీరంరెడ్డి అమరేశ్వరరావు, వైస్ ఎంపీపీగా బడబళ్ల శాంతి ఎన్నికయ్యారు; జనసేన అభ్యర్థుల గెలుపును ఆర్వో ప్రకటించారు.
Pithapuram: పిఠాపురం ఎంపీపీగా వీరంరెడ్డి అమరేశ్వరరావు ఎన్నిక
పిఠాపురం: పిఠాపురం మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ), ఉపాధ్యక్ష (వైస్ ఎంపీపీ) పదవులను జనసేన పార్టీ కైవసం చేసుకుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.రాపర్తి ఎంపీటీసీగా గెలుపొందిన జనసేన నాయకులు వీరంరెడ్డి అమరేశ్వరరావు పిఠాపురం ఎంపీపీగా ఎన్నికయ్యారు.
అలాగే, చిత్రాడ ఎంపీటీసీగా గెలుపొందిన జనసేన అభ్యర్థి బడబళ్ల శాంతి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం వీరిద్దరూ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) స్వప్న అధికారికంగా ప్రకటించారు.
నాయకుల అభినందనలు తెలుపుతూఈ ఎన్నికల సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఎంపీపీ వీరంరెడ్డి అమరేశ్వరరావు, వైస్ ఎంపీపీ బడబళ్ల శాంతిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన పాలకవర్గం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.




