Uppada Kothapalli: అనుమతులు లేకుండా బాణసంచా తయారీ.. ఒకరు అరెస్ట్

Uppada Kothapalli: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం పెద్దకలవలదొడ్డిలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న కొప్పిశెట్టి సత్య వరప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

RAMA KRISHNA, KKD
Published on: 17 Oct 2026 8:20 PM IST
Uppada Kothapalli
X

Uppada Kothapalli: అనుమతులు లేకుండా బాణసంచా తయారీ.. ఒకరు అరెస్ట్

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం, కొమరగిరి పంచాయతీ పరిధిలోని పెద్దకలవలదొడ్డి గ్రామంలో అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో కొప్పిశెట్టి సత్య వరప్రసాద్ (45) తన భార్య సహాయంతో బాణసంచా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సుమారు 400 బాణసంచా తయారీ గొట్టాలు, 30 తయారైన బాణసంచా వస్తువులు, సుమారు 1 కిలో నల్లమందు, బాణసంచా తయారీకి ఉపయోగించే ఒక యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడు కొప్పిశెట్టి సత్య వరప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

పోలీసుల హెచ్చరిక:

ప్రభుత్వ అనుమతులు, చట్టబద్ధమైన లైసెన్సులు లేకుండా బాణసంచా తయారు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా విక్రయించడం వంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

అక్రమ బాణసంచా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై వర్తించే చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD