Pithapuram: పిఠాపురంలో ఘనంగా మహాలయ పక్షాల అన్నదాన కార్యక్రమం ప్రారంభం!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పితృదేవతల స్మరణార్థం 13 ఆలయాల్లో మహాలయ పక్షాల అన్నదాన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

RAMA KRISHNA, KKD
Published on: 27 Sept 2026 4:19 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో ఘనంగా మహాలయ పక్షాల అన్నదాన కార్యక్రమం ప్రారంభం!

Pithapuram: పిఠాపురం నియోజవర్గం శాసనసభ్యులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న ప్రయోగాలతో, అభివృద్ధి, సంక్షేమంతో పిఠాపురం ప్రజలను ఆకట్టుకుంటున్నారు. 14 రోజులు నియోజకవర్గంలోని 13 ఆలయాలలో అన్నదానం చేపట్టారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు మరియు జనసేన పార్టీ స్థానిక ఎన్నికల కోఆర్డినేటర్ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ నేటి నుంచి మహాలయ పక్షాలు. పితృదేవతల పేరిట భోజనాలు పెడతారు.ఈ నేపథ్యంలో పిఠాపురం ,యూ కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో ఉన్న 13 ప్రముఖ ఆలయాలలో ఆదివారం అన్నదాన కార్యక్రమం ఆయన పరోక్షంగా ప్రారంభించారు అని అన్నారు.

నేటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు మహాలయ పక్షాలు ముగిసే వరకు నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటివరకు పిఠాపురంలో ఏ ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇంచార్జ్ డా చిక్కాల వరలక్ష్మి, జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD