Pithapuram: మాజీ ఎంపీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన జనసేన నేతలు
Pithapuram: పిఠాపురంలో అభివృద్ధి జరగలేదన్న మాజీ ఎంపీ వంగా గీత వ్యాఖ్యలపై కొత్తపల్లిలో ప్రెస్‌మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చిన జనసేన నాయకులు.
Pithapuram: మాజీ ఎంపీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన జనసేన నేతలు
పిఠాపురం: ఉప్పాడ–కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొత్తపల్లిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వంగా గీత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు స్పందించారు.
పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని చెప్పడం వాస్తవాలకు దూరంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.
“అభివృద్ధి జరగలేదని చెప్పే ముందు ఒక్కసారి ఉప్పాడ–కొత్తపల్లి మండలంలోని గ్రామాలకు రండి. రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, స్మశానవాటికలు, చెరువులు, వాకింగ్ ట్రాక్‌లు, మత్స్యకారులకు అందిన సహాయ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చూపిస్తాం” అని జనసేన నాయకులు తెలిపారు.
గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే రాజకీయ విమర్శలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ ఇన్‌చార్జ్‌లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




