Pithapuram: పిఠాపురంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పర్యటన!
Pithapuram: పిఠాపురం పరిధిలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన నేతల పర్యటన: ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట గ్రామాల్లో రావు అక్షయ్, డాక్టర్ బుర్ర దివ్య తేజ పర్యవేక్షణ.
Pithapuram: పిఠాపురంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పర్యటన!
పిఠాపురం: తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల పరిస్థితులను తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రతినిధులుగా ఉప్పాడ–కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ ఉప్పాడ,మూలపేట, కోనపాపపేట గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయ చర్యలపై పరిస్థితిని పరిశీలించారు. ఈ పర్యటనలో కాకినాడ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ బుర్ర దివ్య తేజ పాల్గొన్నారు.




