Pithapuram: పిఠాపురం మోహన్ నగర్ కనకదుర్గమ్మ సేవలో ఎస్వీఎస్ఎన్ వర్మ

Pithapuram: పిఠాపురం మోహన్ నగర్ కనకదుర్గమ్మ 32వ శరన్నవరాత్రి ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ వర్మ కలశస్థాపన, ఊరేగింపులో పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD
Published on: 11 Oct 2026 8:09 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం మోహన్ నగర్ కనకదుర్గమ్మ సేవలో ఎస్వీఎస్ఎన్ వర్మ

కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మోహన్ నగర్ లోనీ కనకదుర్గమ్మ దేవాలయంలో దర్శనం చేసుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి 32వ శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారి కలశస్థాపన మరియు ఊరేగింపు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్ వి ఎస్ ఎన్ వర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి అమ్మవారి ఊరేగింపులో పాలు పంచుకొని దర్శించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ టౌన్ ప్రెసిడెంట్ బొజ్జా సతీష్, కొరుప్రోలు శ్రీనివాస్, అల్లవరపు నగేష్ , రాయుడు శ్రీను, కోళ్ల బంగారు బాబు, వాసంశెట్టి సూరిబాబు, తిరుమల రావు, గొర్ల సత్తిబాబు, పొన్నాడ భవాని, కొంతాడి భవాని మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD