Pithapuram: పిఠాపురంలో దోపిడీ కేసు: ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు!
Pithapuram: పిఠాపురం రూరల్ పరిధిలో ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులకు కోర్టు పదేళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
Pithapuram: పిఠాపురంలో దోపిడీ కేసు: ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు!
కాకినాడ: కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ పర్యవేక్షణలో సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాలు మరియు సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ ఫలితంగా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దోపిడీ కేసులో ఇద్దరు నిందితులకు గౌరవ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు, పిఠాపురం వారు 10 సంవత్సరాల 6 నెలల చొప్పున జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1500/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు వివరాలు:
తేదీ 12.06.2023న నిందితులు ఆటోలో ప్రయాణికులుగా నటించి, అనంతరం ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచారు. తదుపరి ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు.
ఈ ఘటనపై పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో భాదితురాలు అప్పికొండ మంగ, భర్త: చిన్నారావు, వయస్సు: 45 సంవత్సరాలు, పోలీస్ స్టేషన్ ఎదురుగా, పిఠాపురం నివాసి ఇచ్చిన పిర్యాదు ఆదారంగా Cr.No.98/2023 U/Sec. 394, 506, 326, 324 r/w 34 IPC మరియు Sec.25 of the Arms Act, 1959 (Amendment Act, 2019) కింద కేసు నమోదు చేయబడింది.
ఈ కేసును అప్పటి పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ నబీ నమోదు చేయగా, అప్పటి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్ దర్యాప్తు నిర్వహించారు.
నిందితుల వివరాలు:
1. A1 – కైలాష్ భగ్ @ సన్నీ, తండ్రి: తీర్ధ్ భగా, వయస్సు: 28 సంవత్సరాలు, ఖంత్రాయ్-2, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం.
2. A2 – సునెల్ సాహు @ బాలికరణ్ సాహు, తండ్రి: కాంచన్ సాహు, వయస్సు: 45 సంవత్సరాలు, గోపాల్పూర్ గ్రామం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.
గౌరవ న్యాయస్థానం తీర్పు:
ఈ కేసులో గౌరవ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి M. బాబు , S.C. No.179/2024లో తీర్పు వెలువరిస్తూ, పై ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాల 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000/- చొప్పున జరిమానా విధించారు.
ఈ కేసులో పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. లక్ష్మణ దొర సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
ప్రస్తుత పోలీసు అధికారుల సహకారం:
ఈ కేసు విచారణ సమయంలో నిందితులను గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచడం, కోర్టు విచారణకు అవసరమైన సమన్వయం, ఇతర న్యాయపరమైన ప్రక్రియలను సక్రమంగా నిర్వహించడంలో ప్రస్తుత పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వి.వి. సత్యనారాయణ , పిఠాపురం రూరల్ ఎస్ఐ షేక్ జాన్ భాషా మరియు కోర్టు హెడ్ కానిస్టేబుల్ వి.వి.వి. కిషోర్ విశేష కృషి చేసి సహకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ కేసు దర్యాప్తు చేసిన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్, కేసు నమోదు చేసిన అప్పటి ఎస్ఐ అబ్దుల్ నబీ, ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన ఏపీపీ శ్రీ బి. లక్ష్మణ దొర, అలాగే ప్రస్తుత సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వి.వి. సత్యనారాయణ, ఎస్ఐ శ్రీ షేక్ జాన్ భాషా మరియు కోర్టు హెడ్ కానిస్టేబుల్ వి.వి.వి. కిషోర్ సమన్వయం, కృషి మరియు నిందితులకు శిక్ష పడేలా సహకరించినందుకు ప్రత్యేకంగా అభినందించారు.




