Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న మహిళలు

Pithapuram: పిఠాపురం చిత్రాడలో తాగునీరు కలుషితమై తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని, మంచినీరు ఇప్పించాలని మహిళలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్నారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 9 Oct 2026 5:56 PM IST
Pithapuram
X

Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న మహిళలు

పిఠాపురం: పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం గొల్లపేట 7,8 వార్డులు ప్రజలు త్రాగే నీరు నాచుతో ఉంటుందని, నీసు వాసన వస్తుందని ఆ నీరుని త్రాగడం వలన తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతున్నమని మా పరిస్థితిని గమనించి దయచేసి మాకు మంచినీరు ఇప్పించండి అని ఆ వార్డుల్లో ఉన్న మహిళలు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకున్నారు.

అలాగే వీధిలైట్లు సరిగా వెళ్లగడం లేదని , అడిగితే మీ ఇంటి ముందు లైటింగ్ చేసుకోండి అంటూ సమాధానం చెబుతున్నారని, డ్రైనేజీలు వ్యవస్థ సరిగ్గా లేదని బాధను వ్యక్తం చేశారు. అలాగే జనసేన ఆవిర్భావ సభ చిత్రాల గ్రామంలో ఏర్పాటు చేసినప్పుడు తాము దైవంగా భావించి పూజించే తాడిపెద్ది ఆ సమయంలో రోడ్డు యాక్సిడెంట్లో గాయాలపాలైయిది.

అప్పటికప్పుడు దానిని గన్నవరం హాస్పిటల్ కి తరలించారని కానీ ఫలితం లేక మరణించిందని, అప్పటినుండి మా చిత్రాలలో వెంకన్న బాబును తాడిపెద్దినీ పూజించుకునే పరిస్థితి లేదని దయచేసి మాకు ఒక వెంకన్న బాబును(తాడిపెద్దిని) ఇమ్మని, అలాగే దానికి పోషకాహారానికి దారి ఏదైనా చూపించమని వేడుకొన్నారు.

అది చనిపోయిన అప్పటినుండి గ్రామంలో ఏది సరిగా జరగడం లేదని దయచేసి మాకు పూజించుకోవడానికి ఒక వెంకన్న బాబుని ఇమ్మని ఎన్నో గ్రామాలకు ఎంతో మంది ప్రజలకు సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ మాకు కూడా ఈ సహాయం చేయండి అని మహిళలు వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపేట 7 8 వార్డుల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram