Pithapuram: ఘనంగా డాక్టర్ బాదం బాలకృష్ణ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం
Pithapuram: పిఠాపురం యు.కొత్తపల్లి వివిఎస్ కాలేజీలో డాక్టర్ బాదం బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు.
Pithapuram: ఘనంగా డాక్టర్ బాదం బాలకృష్ణ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం
పిఠాపురం: పిఠాపురం నియోజవర్గం యు.కొత్తపల్లి వివిఎస్ స్కూల్ & కాలేజ్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఉప్పాడ కొత్తపల్లి మరియు లయన్స్ క్లబ్ పిఠాపురం సంయుక్త ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.
వివిఎస్ స్కూల్ & కాలేజ్ ప్రాంగణం వివిఎస్ స్కూల్స్ & కాలేజెస్ అధినేత వివిఎస్ కృష్ణ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ బాదం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవే ధ్యేయంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలో అన్ని కాలేజీల్లోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రతి సంవత్సరం వివిఎస్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వీరు మాకు ఎంతో తోర్పటు ఇస్తున్నారని అన్నారు.
ఈ శిబిరంలో స్వచ్ఛందంగా విద్యార్థులు, విద్యార్థినీలు రక్తదానం చేసిన పలువురు దాతలను, లయన్స్ క్లబ్ నిర్వాహకులను స్థానికులు మరియు విద్యాసంస్థల సిబ్బంది అభినందించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ లయన్ దొడ్డి రామ సుబ్రహ్మణ్యం ఆర్,సి,లయన్ దంగేటి సతీష్, లయన్ మేడిశెట్టి వెంకటరమణ, లయన్స్ క్లబ్ కొత్తపల్లి లయన్ ఎ.కృష్ణారెడ్డి,లయన్ఆర్.గోపాలరావు,లయన్ కె.వెంకటేశ్వరావు,లయన్ఎల్.బాబూరావు,లయన్ఎల్.వి.వి.సత్యనారాయణ,రమణ, లోల సత్తిపండు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




