Pithapuram: పిఠాపురం: మునిగిన పంట పొలాలను పరిశీలించిన కూటమి నేతలు

Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురం నియోజకవర్గం పి.రాయవరంలో వర్షాలకు మునిగిన పంట పొలాలను డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పరిశీలించారు.

RAMA KRISHNA, KKD
Published on: 28 Sept 2026 8:14 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం: మునిగిన పంట పొలాలను పరిశీలించిన కూటమి నేతలు

కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గం... ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏ రైతుకు నష్టం కలగకూడదని పి.రాయవరం గ్రామంలో రెండు రోజులు కురిసిన వర్షాలకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించడానికి వచ్చిన డిసిసి బ్యాంక్ చైర్మన్ ఫైన్ మాన్ కమిటీ సభ్యులు తుమ్మల రామస్వామి బాబు , వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వాకపల్లి దేవిసూర్యప్రకాష్ , ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఊట నానిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్ రావడం జరిగింది వచ్చి మునిగిపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ ఏ ఒక్క రైతు నష్టపోకూడదని

అధికారులకు ఫోన్ చేసి తక్షణమే నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం రాయమని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పి రాయవరం నీటి సంఘం అధ్యక్షులు కారపురెడ్డి కృష్ణ , వార్డ్ ఇంచార్జ్, బూత్ ఇన్చార్జిలు, పి రాయవరం జనసేన పార్టీ నాయకులు కారపురెడ్డి వెంకటేష్ , జనసైనికులు, కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు, రైతులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD