Peddapuram: పెద్దాపురంలో ఉత్కంఠగా ముగిసిన నామినేషన్ల పర్వం
Peddapuram: పెద్దాపురం మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ నడుమ ముగిసింది. వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Peddapuram: పెద్దాపురంలో ఉత్కంఠగా ముగిసిన నామినేషన్ల పర్వం
Peddapuram: మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉత్కంఠభరితంగా ముగిసింది. నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావడంతో కేంద్రాలన్నీ అభ్యర్థులు, అనుచరులతో కిటకిటలాడాయి.
పెద్దాపురంలో నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులను లోపల ఉంచి అధికారులు తలుపులువేశారు. చివరి నిమిషంలో నామినేషన్ వేసేందుకు ఓ అభ్యర్ధి పరుగులు తీశాడు. సరిగ్గా 3:14 నిమిషాలకు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు ఓ యువతి తండ్రితో కలిసి నామినేషన్ కేంద్రానికి రావడంతో, సమయం అయిపోయిందని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం అనుమతించేది లేకపోవడంతో చేసేది లేక ఆ తండ్రీకూతుర్లు వెనుతిరిగారు.
మరోవైపు, వైకాపా నుండి చైర్మన్ అభ్యర్థులుగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు నామినేషన్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
పార్టీ తరఫున పేరిశెట్టి మృత్యుంజయరావు, కాపగంటి సౌందర్య లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు. అసలు అధిష్టానం ఎవరికి బి-ఫామ్ ఇస్తుందనే దానిపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
మొత్తానికి పెద్దాపురంలో గడువు ముగిసే వేళ ఒకవైపు నామినేషన్ వేయలేక ఓ అభ్యర్థి నిరాశ చెందగా, మరోవైపు ఒకే పార్టీలో ఇద్దరు నేతలు చైర్మన్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడం హాట్ టాపిక్గా మారింది.




