Peddapuram: వైఎస్సార్‌సీపీకి మాజీ ఏఎంసీ ఛైర్మన్ రాజబ్బాయి రాజీనామా

Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ముత్యాల రాజబ్బాయి వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 22 Sept 2026 6:56 PM IST
Peddapuram
X

Peddapuram: వైఎస్సార్‌సీపీకి మాజీ ఏఎంసీ ఛైర్మన్ రాజబ్బాయి రాజీనామా

కాకినాడ జిల్లా, పెద్దాపురం: వైసిపి పార్టీకి పెద్దాపురం మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి రాజీనామా, వ్యక్తిగత కారణాలతో వైసిపి కి రాజీనామా చేస్తున్న పేర్కొన్న రాజబ్బాయి.

పెద్దాపురం మండలం రాయభూపాల పట్నంలో ముత్యాల రాజబ్బాయి మీడియా సమావేశం, 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నిండి రాజకీయ జీవితం మొదలు పెట్టాను అప్పటి నుండి అనేక మంది ఎమ్మెల్యేలతో కలసి పని చేసాను.

ఆయా ఎమ్మెల్యేలతో కలసి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో నా సొంత నిధులు కూడా ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వైసీపీ నాయకునిగా ఉన్న నేను నా సొంత కారణాల వల్ల రాజీనామా చేయడం జరిగింది.

చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ నాయకునిగా ఉన్న నేను కొన్ని అనివార్య కారణాలతో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ కి మద్దతు ఇవ్వవలసి వచ్చిందని,అప్పట్లో వైసీపీ కండువా కప్పుకోవడం వల్ల ఇప్పుడు రాజీనామా చేసినట్టు ప్రకటించవలసి వచ్చిందన్న రాజబ్బాయి.

తమ కార్యకర్తల నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని రాజబ్బాయి పేర్కొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM