Peddapuram: మున్సిపల్ ఎన్నికలు: పోలీసులకు పెద్దాపురం సీఐ దిశానిర్దేశం!
Peddapuram: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు పెద్దాపురం సీఐ సూచించారు.
Peddapuram: మున్సిపల్ ఎన్నికలు: పోలీసులకు పెద్దాపురం సీఐ దిశానిర్దేశం!
Peddapuram: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పెద్దాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ సూచించారు.
బుధవారం పెద్దాపురం సర్కిల్ కార్యాలయంలో పోలీసు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దాపురం ఎస్ఐ యు.పాపారావుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




