Pedana: ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌పై విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ నేతలు

Pedana: పెడనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌పై వైసీపీ నాయకుల విమర్శలను ఖండించిన టీడీపీ నేతలు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్.

Reddy, Pedana
Published on: 25 Sept 2026 8:35 PM IST
Pedana
X

Pedana: ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌పై విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ నేతలు

పెడన: బూతుల పంచాంగమే తప్ప ఏమీ తెలియని ప్రతిపక్ష హోదా లేని వైసిపి నాయకుల మా కాగిత కృష్ణ ప్రసాదను విమర్శించేది అని చెబుతూ, మచ్చలేని నిస్వార్ధ నాయకుడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆయన్ని విమర్శించే హక్కు వైసీపీ నాయకులకు లేదని జోగి హయాంలో నియోజకవర్గాన్ని ఎంత దోచుకున్నారో ప్రజలకు అర్థమయ్యే వాళ్లకి 11 సీట్లు మాత్రమే కేటాయించారని మండల టిడిపి అధ్యక్షుడు శలపాటి ప్రసాద్ అన్నారు.

ఈ మేరకు తోట మూలలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పాత్రికేయులే సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగిత వెంకట్రావు హయాంలో ఆయన చుట్టూ ఉప్పాల కుటుంబం తిరిగి నేడు ఆయన విమర్శించే స్థాయికి ఎదగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

నియోజవర్గం మొత్తం మీద చూసుకుంటే 200 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామని పార్టీలతో పని లేకుండా నిస్వార్థముగా సీఎం సహాయ నిధికి చెక్కుల పంపిణీ చేశామని తెలిపారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తి మా నాయకుడు కాగిత అని స్పష్టం చేశారు.

అనంతరం మాజీ జెడ్పిటిసి నగేష్ మాట్లాడుతూ మొన్న జరిగిన వైసిపి బహిరంగ సభలో వైసీపీ నాయకుడు పేర్ని నాని పెడన ఆయకట్టు గురించి మాట్లాడుతూ 29 వేల ఎకరాలు అని చెప్పాడని అసలు నియోజకవర్గంలో ఎంత సాగు ఆయకట్టు ఉందో ఆయనకు తెలుసా పని ప్రశ్నించారు.

అధికారులను అడిగితే పేర్ని నానికి చెబుతారని వాపోయారు. పేదల బియ్యాన్ని బొకేసి ఇప్పుడు సత్య హరిచంద్రడు లాగా నీతులు చెప్పటం ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం సీరం ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముఠామే ప్రభుత్వంపై తమ ఎమ్మెల్యే పై బురదజల్లే కార్యక్రమం వైసీపీ నాయకులు పెట్టుకున్నారని అన్నారు 24 పంచాయతీలలో ఏ పంచాయతీకి ఎంత ఇచ్చామో మీ హయాంలో ఎంత ఇచ్చారో చర్చకు సిద్ధం అన్నారు.

20 సంవత్సరాలుగా జంజీరు గ్రామానికి వెళ్లడానికి రహదారి లేకపోతే గ్రామీణ మాత్రమే పరిచి ఎం బుక్ లో పెట్టి వైసిపి హయాంలో దొంగబిల్లులు పెట్టుకుంటానికి సిద్ధపడింది వైసీపీకి నాయకులు కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారాలకు రాగానే ఆ రోడ్డు నిర్మాణం ఎలాగైనా నిర్మించాలని తమ ఎమ్మెల్యే శాయి శక్తుల ప్రయత్నించారని ఏ కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే జనసేన నియోజకవర్గం నాయకుడు దాసరి సత్యనారాయణ ముందుకు వచ్చి తనక నష్టం జరిగిన పర్వాలేదులే అని రోడ్డు నిర్మాణం చేపట్టి పూర్తి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Reddy, Pedana

Reddy, Pedana