Kakinada: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యం: ఎస్పీ బిందు మాధవ్

Kakinada: కాకినాడ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమని కాకినాడ రూరల్‌లో ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు.

P Trimurthulu, Kakinada Rural
Published on: 24 Oct 2026 2:13 PM IST
Kakinada
X

Kakinada: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యం: ఎస్పీ బిందు మాధవ్

కాకినాడ: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత పారదర్శకంగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించే క్రమంలో ఆయన కాకినాడ రూరల్ మండల కార్యాలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్వో గౌరీ శంకర్, ఎంపీడీవో సతీష్ బాబు లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు.​నామినేషన్ల ప్రక్రియ విజయవంతం​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ మూడు రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో సజావుగా సాగి నిన్నటితో ముగిసిందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారని పేర్కొన్నారు.​

పరిశీలన, ఉపసంహరణలకు పటిష్ట భద్రత​నేడు 20 మండలాల్లో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ), ఉపసంహరణ (విత్‌డ్రావల్) ప్రక్రియ కొనసాగుతోందని, వీటికి కూడా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రక్రియను పూర్తి చేసే దశకు తీసుకొచ్చామని వివరించారు.​పోలింగ్, కౌంటింగ్‌కు పూర్తి స్థాయి ఏర్పాట్లు​రాబోయే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్, ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) సమయాల్లో తగినంత భద్రతను సమకూరుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన హామీ ఇచ్చారు.​సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా​జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా అన్న ప్రశ్నకు ఎస్పీ స్పందిస్తూ, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని తెలిపారు.

అటువంటి సున్నితమైన ప్రాంతాల్లో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా అదనపు బలగాలను మోహరించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో డి.ఎస్.పి లు దుర్గారావు , కేవీ సత్యనారాయణ,సర్పవరం సీఐ సిహెచ్ ప్రకాష్, ఎస్సైలు ఏసుబాబు, శ్రీనివాసు, సిబ్బంది పాల్గొన్నారు.​

P Trimurthulu, Kakinada Rural

P Trimurthulu, Kakinada Rural