Pithapuram: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 13 ఆలయాల్లో అన్నదానం!
Pithapuram: మహాలయ పక్షాల సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని 13 ప్రముఖ ఆలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిరంతర అన్నదానం నిర్వహిస్తున్నారు.
Pithapuram: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 13 ఆలయాల్లో అన్నదానం!
Pithapuram: పిఠాపురం నియోజవర్గం శాసనసభ్యులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న ప్రయోగాలతో, అభివృద్ధి,సంక్షేమంతో పిఠాపురం నియోజవర్గంనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచారు.తాజాగా 14 రోజులు నియోజకవర్గంలోని 13 ఆలయాలలో అన్నదానం చేపట్టారు.
ఈ సందర్భంగా జనసేన కాకినాడ్ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి నుంచి మహాలయ పక్షాలు పితృదేవతల పేరిట పవన్ కళ్యాణ్ భోజనాలు ఏర్పాటు చేయడం వాటిని విజయవంతగా 4వ రోజు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం ,యూ.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో ఉన్న 13 ప్రముఖ ఆలయాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు అన్నారు.నేటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు మహాలయ పక్షాలు ముగిసే వరకు నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఇప్పటివరకు పిఠాపురంలో ఏ ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు అని అన్నారు.ఈ కార్యక్రమంలోజనసేన నాయకులు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు మరియు జనసేన పార్టీ స్థానిక ఎన్నికల కోఆర్డినేటర్ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇంచార్జ్ డా చిక్కాల వరలక్ష్మి, జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.




