Pithapuram: ఆపదలో ఆదుకోవడం అంటే పవన్ కళ్యాణ్‌దే!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మానసిక అంగవైకల్యం ఉన్న ఇద్దరు కుమారులకు రూ.6 వేల చొప్పున ప్రత్యేక పింఛన్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం.
Pithapuram: ఆపదలో ఆదుకోవడం అంటే పవన్ కళ్యాణ్‌దే!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం డైవర్స్ కాలనీ నందు ఎన్నో ఏళ్లగా గత ప్రభుత్వంలో ఎన్నీ ఆర్జీలు పెట్టుకున్న ఎటువంటి స్పందన లేదని,కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురం నియోజవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశంతో పిలక దుర్గారావు సంధ్య కుమారులైన అఖిల్ నిఖిల్ కు మానసిక అంగవైకల్యం ఉండడంతో దానిని గుర్తించి వారికి ఆర్థికంగా మానసికంగా తోరపాటున అందించేందుకు ఇద్దరు కుమారులకు చేరొక 6000 చొప్పున పెన్షన్ కూటమి ప్రభుత్వం స్పెషల్ గా పిఠాపురం పట్టణంలో ఒకే ఒక్క నూతన పెన్షన్ను వీరి కుటుంబంలో ఉన్న ఇద్దరు కుమారులకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ మేము ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నామని ఎటువంటి స్పందన రాలేదని, పవన్ కళ్యాణ్ కు జన్మదిన సందర్భంగా డా జ్యోతుల శ్రీనివాస్ పాడాపిడి శివరాం ప్రసాద్ సారథ్యంతో పెన్షన్ వచ్చేంతవరకు తమ సొంత నిధులతో 2000 అందించడం జరిగిందని, ఇప్పుడు కూటమ ప్రభుత్వం వారు తన ఇద్దరు కుమారులకు చేరొక 6000 చాపునామొత్తం 12000 అందించడం జరిగిందని అన్నారు.
అనంతరం జనసేన పిఠాపురం పట్టణ ఇంచార్జ్ డా చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి అంటే పిఠాపురం ఆపదలో ఆదుకోవడం అంటే పవన్ కళ్యాణ్ అనేదానికి నిదర్శనమే ఈ కార్యక్రమమని ఎన్నాల్వో వారు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ పెన్షన్ వారిని కచ్చితంగా వారికి ఊరట నిస్తుందని పవన్ కళ్యాణ్ మాట ఇస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డైవర్స్ కాలనీ వార్డు ఇంచార్జ్ పల్నాటి మధుబాబు,జనసేన నాయకులు మార్నీడి రంగబాబు, కొండేపూడి శివ,వనం వీరబాబు, వీర మహిళలు తోట నాగిని, ముప్పెన రత్నం,గాది శ్రీను, కీర్తి దొరబాబు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




