Prathipadu: ప్రత్తిపాడు మండలంలో 380 ఎకరాల్లో నీట మునిగిన వరి పంట!
Prathipadu: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో భారీ వర్షాలకు 380 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వ్యవసాయ అధికారి జాకా అమృత పొలాలను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు.
Prathipadu: ప్రత్తిపాడు మండలంలో 380 ఎకరాల్లో నీట మునిగిన వరి పంట!
Prathipadu: ప్రత్తిపాడు మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రత్తిపాడు,ఏలూరు,ఉత్తరకంచి,శరభవరం గ్రామాల్లో సుమారు 380 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి.ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారిని జాకా అమృత ఆయా గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పొలాల్లో నిలిచిన నీటిని కాలువల ద్వారా వీలైనంత త్వరగా బయటకు పంపించాలని సూచించారు.పంట పొలాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ,నీటిని పూర్తిగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తెగుళ్లు,పురుగుమందుల పిచికారీతో పాటు ఎరువుల వినియోగాన్ని వాయిదా వేయాలని సూచించారు.వర్షాలు పూర్తిగా ఆగిన అనంతరం లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండజిమ్ లేదా రెండు గ్రాముల కార్బెండజిమ్ + మాంకోజెబ్ లేదా ఒక మిల్లీలీటరు ప్రొపికొనజోల్ కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.అంకుర దశలో ఉన్న వరి పంటలో ఎకరాకు 35 కిలోల యూరియా, 13 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను వర్షాలు తగ్గిన తర్వాత నేలలోని తేమను పరిశీలించి వేయాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ అర్జున్,అగ్రికల్చర్ అసిస్టెంట్ మణికంఠ,రైతులు పాల్గొన్నారు.




