Peddapuram: స్థానిక పోరులో కూటమి ప్రభంజనం: ఎమ్మెల్యే చినరాజప్ప

Peddapuram: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభంజనం కొనసాగుతుందని, ఇతర పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 20 Oct 2026 5:27 PM IST
Peddapuram
X

Peddapuram: స్థానిక పోరులో కూటమి ప్రభంజనం: ఎమ్మెల్యే చినరాజప్ప

Peddapuram: స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి పార్టీల ప్రభంజనం కొనసాగుతుందని ఇతర పార్టీలన్నీ తుడిచి పెట్టుకుని పోతాయని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. పెద్దాపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల ప్రచార కరపత్రాలు విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘాల్లో జరిగిన అభివృద్ధి వివరిస్తూ రెండు మున్సిపాల్టీలకు విడివిడిగా ప్రచురించిన కరపత్రాలను నియోజవర్గ పరిశీలకులు సాటిబాబుతో కలసి చినరాజప్ప ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిన రాజప్ప మాట్లాడుతూ గొడ్డలి పార్టీ వల్ల పాడైన రోడ్లను తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని, సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామని అన్నారు.

అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో స్థానిక ఎన్నికలు జనవరిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారని, ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని, రేపటి నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ లను కలుపుకుని ముందుకు వెళ్తామని, ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నియోజకవర్గ పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు, కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM