Kothapalli: నాగులపల్లిలో తాగునీటి సమస్యపై స్పందించిన జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్!

Kothapalli: కొత్తపల్లి మండలం నాగులపల్లిలో దెబ్బతిన్న తాగునీటి పైప్‌లైన్‌ను జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్ పరిశీలించి, సొంత నిధులతో తాత్కాలిక నీటి వసతి కల్పించారు.

RAMA KRISHNA, KKD
Published on: 25 Sept 2026 3:49 PM IST
Kothapalli
X

Kothapalli: నాగులపల్లిలో తాగునీటి సమస్యపై స్పందించిన జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్!

Kothapalli: నాగులపల్లి గ్రామంలోని పాటిమీద బ్రిడ్జి వద్ద ప్రధాన మంచినీటి పైప్‌లైన్‌ పాడవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా, కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ వెంటనే స్పందించారు.

కొత్తపల్లి మండలం ఎమ్మార్వో, ఎంపీడీవో అధికారులతో కలిసి సమస్య ఏర్పడిన ప్రాంతానికి వెళ్లి ప్రధాన పైప్‌లైన్‌ను పరిశీలించారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

అలాగే పైప్‌లైన్‌ పాడవడం వల్ల తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు రావు అక్షయ్ తన సొంత నిధులతో తాత్కాలికంగా మంచినీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులతో సమన్వయం చేస్తామని రావు అక్షయ్ తెలిపారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD