Mamidikuduru: గోగన్నమఠం ఎంపీటీసీ బీఎస్పీ అభ్యర్థిగా మోకా మధుబాబు నామినేషన్!

Mamidikuduru: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠం ఎంపీటీసీ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా మోకా మధుబాబు నామినేషన్ దాఖలు చేశారు.

PRABHU, RAZOLE
Published on: 23 Oct 2026 2:31 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: గోగన్నమఠం ఎంపీటీసీ బీఎస్పీ అభ్యర్థిగా మోకా మధుబాబు నామినేషన్!

Mamidikuduru: మామిడికుదురు మండలం గోగన్నమఠం ఎంపీటీసీ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా మోకా మధుబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ పార్టీ బీ-ఫామ్ అందజేసి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.

ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ, చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే సమాజంపై అవగాహనతో ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుందని అన్నారు. గోగన్నమఠం జనరల్ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి పోటీకి దిగడంపై పలువురు దళిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE