Jaggampeta: జగ్గంపేటలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసంతృప్తి!

Jaggampeta: కాకినాడ జిల్లా జగ్గంపేటలో మంచినీటి ట్యాంక్ శంకుస్థాపన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉండటంపై RWS ఏఈ తీరుపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర అసంతృప్తి.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 6 Oct 2026 7:27 AM IST
Jaggampeta
X

Jaggampeta: జగ్గంపేటలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసంతృప్తి!

Jaggampeta: జగ్గంపేటలో మంచి నీటి ట్యాంక్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి సంబంధించి చేసిన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే.. RWS AE ఎం. రాంజీరావు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చేశారు.

ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయకుండా కొబ్బరి చెట్టుకు అమర్చి వదిలేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కార్యక్రమానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు కనీస ప్రోటోకాల్, కార్యక్రమ నిర్వహణపై శ్రద్ధ చూపకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది..

అదేవిధంగా శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాల కోసం బ్రాహ్మణులను కూడా ముందస్తుగా ఏర్పాటు చేయకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యే విషయం తెలిసి ఉన్నప్పటికీ, కనీస ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయకపోవడంపై అధికారులను ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.

మంచినీటి ట్యాంక్ వంటి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో అధికారులు సమన్వయంతో వ్యవహరించి, కార్యక్రమాన్ని గౌరవప్రదంగా నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించినట్లు కూడా తెలుస్తుంది..

RWS శాఖకు సంబంధించిన కార్యక్రమంలోనే ఏర్పాట్లు ఈ విధంగా ఉండటంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కార్యక్రమాల నిర్వహణలో అధికారుల సమన్వయం, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి అవసరమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA