Yeleswaram: ఏలేశ్వరంలో కూటమి భారీ ర్యాలీ: అక్షితకు మద్దతు
Yeleswaram: ఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల ముగింపు సందర్భంగా చైర్మన్ అభ్యర్థిని యార్లగడ్డ అక్షిత, అభ్యర్థులకు మద్దతుగా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది.
Yeleswaram: ఏలేశ్వరంలో కూటమి భారీ ర్యాలీ: అక్షితకు మద్దతు
కాకినాడ జిల్లా: ఏలేశ్వరం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో కూటమి పార్టీశ్రేణులు ఏలేశ్వరంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, చైర్మెన్ అభ్యర్థిని యార్లగడ్డ అక్షిత తో కలిసి భారీ ఎత్తున ర్యాలీగా ఏలేశ్వరం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం బాలాజీ చౌక్ సెంటర్ లో బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలో ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్,ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. సందర్భంగా ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్, మాట్లాడుతూ.ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఇప్పటికే ఏలేశ్వరం మున్సిపాలిటీకి సుమారు 96 కోట్లు అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయడం జరిగిందని,కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
సీసీరోడ్లు,డ్రైనేజీలు, త్రాగునీరు,పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని,ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఏలేశ్వరం నుంచి జడ్డింగి అన్నవరం రోడ్డు నెల రోజుల్లో పని పూర్తవుతుందన్నారు.
అప్పనపాలెం బ్రిడ్జి కూడా త్వరలోనే నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ బ్రిడ్జి నిమిత్తం చాలాసార్లు తిరిగి పునర్నిర్మానానికి త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు.
తూర్పు కాపు కమ్యూనిటీ హాల్,ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఆర్యవైశ్యుల కమ్యూనిటీ హాల్ కు ఎంపీ గ్రాంట్ల నుండి స్థల పరిశీలన జరిగిన వెంటనే శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు.
కూటమి చైర్మన్ అభ్యర్థి యార్లగడ్డ అక్షితను,28 వార్డుల అభ్యర్థులను తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.




