Kakinada: ఏలేశ్వరం మండలం యర్రవరంలో భారీ అన్నప్రసాద వితరణ!
Kakinada: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం అరటి మార్కెట్ వద్ద వినాయక చవితి సందర్భంగా భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
Kakinada: ఏలేశ్వరం మండలం యర్రవరంలో భారీ అన్నప్రసాద వితరణ!
Kakinada: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో జాతీయ రహదారని అనుకోని ఉన్న అరటి మార్కెట్ వద్ద ఓనర్స్, మరియు వర్కర్స్ అద్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. వినాయకుని చవితి, పూజలు నేపద్యంలో ప్రతీ ఏటా ఈ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని మార్కెట్ సభ్యులు సమిష్టిగాఅత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 5వేల మంది భక్తులు ఈ అన్న ప్రసాదాని స్వీకరించారని అన్నారు. అన్నసంతర్పణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అరటి మార్కెట్ ఓనర్స్ మరియు వర్కర్స్, సభ్యులు, పలువురు నాయకులు పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.




