Kakinada: కాకినాడ రూరల్‌లో ఏఎమ్‌గ్రీన్ సంస్థ వద్ద స్థానిక యువత నిరసన!
Kakinada: కాకినాడ రూరల్‌లోని ఏఎమ్‌గ్రీన్ సంస్థ వద్ద స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసన చేపట్టారు.
Kakinada: కాకినాడ రూరల్‌లో ఏఎమ్‌గ్రీన్ సంస్థ వద్ద స్థానిక యువత నిరసన!
Kakinada: కాకినాడ రూరల్ స్థానికేతరులకు కాకుండా స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఎమ్ గ్రీన్ కో ప్రైవేట్ సంస్థ వద్ద స్థానికులు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యతతో సుమారు 700 మంది దరఖాస్తుల చేసుకుంటే వారిలో 15 మందికి ఉపాధి కల్పించడం సమంజసంగా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయట ప్రాంతాల నుంచి సుమారు రెండు వేలకు మందిపైగా ఇందులో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నప్పుడు స్థానికంగా నాలుగు గ్రామాల ప్రజలకు సుమారు 700 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మీకు ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా మాకు ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతనే అవకాశాలు కల్పించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.




