Kothapeta: కొత్తపేట అభివృద్ధికి అభ్యర్థి సందీప్‌ను గెలిపించండి!
Kothapeta: కొత్తపేట పంచాయతీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బలపరిచిన కూటమి సర్పంచ్ అభ్యర్థి యల్లమిల్లి సందీప్‌ను గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు.
Kothapeta: కొత్తపేట అభివృద్ధికి అభ్యర్థి సందీప్‌ను గెలిపించండి!
Kothapeta: కొత్తపేట పంచాయతీ అభివృద్ధి కోసం నిత్యం పరితపించేది.ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు.సంక్షేమ అభివృద్ధి ఫలాలు గ్రామస్తులు అందరికీ అందాలని ఆయన ఆలోచన. అందుకే యువకుడు.. విద్యావంతుడు అయిన యల్లమిల్లి సందీప్ ని సర్పంచ్ అభ్యర్థిగా మన ముందుకు తీసుకొచ్చారు !రహదారులైనా, డ్రైనేజీలైనా, తాగునీరు అయినా,పరిశుభ్రత కొరకైనా, పేదలకు పెన్షన్ అయినా, ఇళ్ల స్థలాలైనా, రుణాల అందించాలన్నా చురుకైన యువకుడు ద్వారా సత్వరమే వారికి అందుబాటులో తేవాలని తద్వారా దశాబ్దాలుగా కొత్తపేట ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పంతో సత్యానంద రావు గారు ముందడుగు వేస్తున్నారు.
వారి ఆలోచనలకు అనుగుణంగా విద్యావంతుడు సమస్యల పట్ల అవగాహన కలిగిన యల్లమిల్లి సందీప్ ని కూటమి పార్టీలు తరఫున అభ్యర్థిగా ఎంపిక చేశారు .ఆరోపణలు అసత్యంకొత్తపేట పంచాయతీలో పన్నులు, వస్తువులకు సంబంధించి అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించడం, వెంటనే ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు స్పందించి విచారణ జరిపించడం.సదరు కార్యదర్శి సస్పెండ్ కావడం జరిగింది.
దుర్వినియోగమైన పంచాయతీ సొమ్మును రికవరీ చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం చర్యలు చేపట్టింది.దీనిపై కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య ఆరోపణలు చేయడం తగదు..పార్టీ పట్ల అంకితభావం, సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని వార్డుల వారీగా కూటమి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది.డబ్బులు కలిగిన వారికే సీట్లు ఇచ్చారనే ప్రచారం ఆరోపణలు చేసిన వారికే వర్తిస్తుంది.గ్రామంలోని డబ్బులు కలిగిన వ్యక్తిని పట్టుకుని సర్పంచ్ అభ్యర్థి అంటూ ఎవరు ముందుకు తెస్తున్నారో గ్రామస్తులు అందరూ చూస్తున్నారు.
గ్రామ అభివృద్ధి కంటే డబ్బే ముఖ్యమనుకునే వారి మాటలు నమ్మకండి.కొత్తపేట పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపించడానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు, మాజీ శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు గారు బలపరిచిన ..
యల్లమిల్లి సందీప్ ని సర్పంచ్ గా గెలిపించాలని కోరుతున్నాం .




