Kirlampudi: ఒక్కరోజులో రూ.2 లక్షల సీఎం సహాయ నిధి ఎల్ఓసి మంజూరు

Kirlampudi: కిర్లంపూడిలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో ఒక్కరోజులోనే రూ.2 లక్షల సీఎం సహాయ నిధి ఎల్ఓసి మంజూరైంది.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 6 Oct 2026 5:10 PM IST
Kirlampudi
X

Kirlampudi: ఒక్కరోజులో రూ.2 లక్షల సీఎం సహాయ నిధి ఎల్ఓసి మంజూరు

కిర్లంపూడి: కిర్లంపూడి మండలం సోమవరం గ్రామానికి చెందిన అడపా పెద్దకాపు కుమార్తె అడబాల నూకరత్నంకు బ్రెయిన్ కు అత్యవసరంగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఇబ్బంది పడుతుండగా విషయం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి తీసుకురావడం జరిగింది.

విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడి బ్రెయిన్ సర్జరీ నిమిత్తం రూ. 2 లక్షల ఎల్.ఓ.సి చెక్కును ఒక్కరోజులోనే మంజూరు చేయించారు.

మంగళవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఎల్.ఓ.సి చెక్కును అందజేశారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కిర్లంపూడి మండల టిడిపి యువనేత జంపన రవివర్మ, సోమవారం నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల కోటి, గ్రామ టిడిపి అధ్యక్షులు మంచి కంటి శ్రీను, కంచుమర్తి నాని, సిరిపిరెడ్డి రాజేష్, జనసేన నాయకులు ఏనుగుపల్లి శ్రీను, సోమవారం జ్యోతుల నెహ్రూ యువసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA