Kirlampudi: వీరవరంలో కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు ప్రారంభం
Kirlampudi: కిర్లంపూడి మండలం వీరవరంలో రూ.కోటితో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించి, పౌష్టికాహార స్టాల్‌ను పరిశీలించారు.
Kirlampudi: వీరవరంలో కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు ప్రారంభం
కిర్లంపూడి: కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ. కోటి వ్యయంతో నిర్మించిన ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రత్యేక స్టాల్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించి పిండి వంటలను రుచి చూశారు.
అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పల్లె అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, పల్లె పండుగ 3.0 ద్వారా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నామని అన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.
వీరవరం గ్రామంలో ఎమ్మెల్యే చిన్ననాటి స్మృతులు నెమరు వేసుకున్నారు. ఒక బ్రిడ్జి, ఆర్టీసీబస్సు, ఏలేరు నుండి వ్యవసాయానికి సాగునీరు అందించే కాలువలు కావాలి అని అడగగా గ్రామం కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు.
తోట రవి , తోట గాంధీ , వీరం రెడ్డికాశీబాబు, చదరంచంటి బాబు, కొత్త కొండబాబు, ఎస్. వి. ఎస్ అప్పలరాజు,మారిశెట్టి భద్రం,పాలచర్ల నాగేంద్ర చౌదరి, గొల్లపల్లి సూరిబాబు, దాసరిసీతారామకృష్ణ, నీలంశ్రీను, అనుకుల శ్రీకాంత్,తూముకుమార్, గుడాల.రాంబాబు,కుర్ల.చినబాబు, కుంచే తాతాజీ, పాఠం శెట్టి రవి,కళ్ల. వెంకటేష్, పంచాయతీరాజ్ డి ఇ ఉమాశంకర్, ఎండిఓ హరికృష్ణ, ఎమ్మార్వో సాయికిరణ్ అధిక సంఖ్యలో టిడిపి, జనసేన, బిజెపి కూటమినాయకులు, ప్రజలు పాల్గొన్నారు.




