Kirlampudi: ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన నవీన్
Kirlampudi: కిర్లంపూడి మండలంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ బాధితుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. రూ. 1.77 లక్షల ఆర్థిక భరోసా.
Kirlampudi: ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన నవీన్
కిర్లంపూడి: కిర్లంపూడి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం హృదయాన్ని తాకేలా సాగింది. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్కులను అందజేసి వారి యోగక్షేమాలు, ఆరోగ్య వివరాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
మండలంలోని బూరుగుపూడి గ్రామంలో ఒకరికి రూ.38,879, సోమవారం గ్రామంలో ఒకరికి రూ.20,795, సోమరాయిపేట గ్రామంలో ఒకరికి రూ.31,085, జగపతినగరంలో ఇద్దరికి రూ.46,112, సింహాద్రిపురంలో ఇద్దరికి రూ.40,544 చొప్పున మొత్తం ఐదు గ్రామాలకు చెందిన 7 మంది లబ్ధిదారులకు కలిపి రూ.1,77,433 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అనారోగ్యం ఎవరికీ చెప్పి రాదని, అలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉండాలని, అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పేదవాడి కంట కన్నీరు తుడిచేందుకే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రతి అర్హుడిని ఆదుకుంటున్నామని తెలిపారు.
ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు రెట్టింపు భరోసా కల్పిస్తున్నామని, ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఒక్క అర్హుడు కూడా సహాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఇంటి తలుపు తట్టి మరీ సహాయం అందించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు, తూము కుమార్, అనుకూల శ్రీకాంత్, కుంచె తాతాజీ, పాఠం శెట్టి మురళీకృష్ణ, కుర్ల చినబాబు, కాళ్ల వెంకటేష్,టిడిపి జనసేన బిజెపి ఓటమి నాయకులు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




