Tuni: తునిలో విజిలెన్స్ మెరుపు దాడులు.. షాపులు మూసేసి వ్యాపారుల పరార్!

Tuni: కాకినాడ జిల్లా తుని పట్టణంలో అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించగా పలువురు వ్యాపారులు షాపులు మూసేసి పరారయ్యారు.

MANIKANTA, TUNI
Published on: 16 Nov 2026 5:32 PM IST
Tuni
X

Tuni: తునిలో విజిలెన్స్ మెరుపు దాడులు.. షాపులు మూసేసి వ్యాపారుల పరార్!

తుని: తుని పట్టణంలో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక మెరుపు దాడులు వ్యాపార వర్గాల్లో కలకలం రేపాయి. పట్టణంలోని ఫీడర్ రోడ్డుతో పాటు పలు ప్రధాన ప్రాంతాల్లోని బియ్యం దుకాణాలు, కిరాణా షాపులపై విజిలెన్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

​నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు బియ్యాన్ని విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అయితే, అధికారుల తనిఖీల విషయం ముందస్తుగా తెలియడంతో పలువురు వ్యాపారులు తమ షాపులకు తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

​అనంతరం అధికారులు పట్టణంలోని పలు చిన్న కిరాణా దుకాణాల్లోనూ సోదాలు నిర్వహించి ధరల పట్టికలు, నిల్వలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న కొన్ని షాపులను గుర్తించి, వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అధికారుల ఆకస్మిక తనిఖీలతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI