Tuni: మళ్లీ తెరపైకి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. దర్యాప్తు ముమ్మరం!
Tuni: ఈ ఏడాది జూన్‌లో కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై హైకోర్టు ఆదేశాలతో డీజీపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
Tuni: మళ్లీ తెరపైకి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. దర్యాప్తు ముమ్మరం!
తుని: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో కాకినాడ జిల్లా తునిలో ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
గతంలోనూ విస్తృత గాలింపు:
ఈ ఘటనపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఎస్పీ స్వయంగా పర్యటించడంతో పాటు, గ్రేహౌండ్స్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) టీమ్స్, స్పెషల్ పార్టీలు, ఫైర్ మరియు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో సంయుక్తంగా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.




