Tuni: ఏవీనగరంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య!

Tuni: తొండంగి మండలం ఏవీనగరంలో ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని దివ్య పేర్కొన్నారు.

MANIKANTA, TUNI
Published on: 5 Nov 2026 4:42 PM IST
Tuni
X

Tuni: ఏవీనగరంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య!

తుని: ప్రభుత్వ విప్, తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొండంగి మండలం ఏవీనగరం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని 15వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. ఆమెతో పాటు సీనియర్ నేత యనమల రాజేష్ కూడా ఇదే పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి పౌరుడూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లు తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI