Kakinada: తుని నియోజకవర్గాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు!

Kakinada: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేసింది. జాతీయ రహదారిపై వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

MANIKANTA, TUNI
Published on: 27 Nov 2026 8:42 AM IST
Kakinada
X

Kakinada: తుని నియోజకవర్గాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు!

కాకినాడ: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 7:30 గంటలు దాటుతున్నా సరే మంచు ఏమాత్రం వీడకపోవడంతో పరిసర ప్రాంతాలన్నీ మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారాయి. ​దట్టమైన పొగమంచు కారణంగా జాతీయ రహదారిపై మరియు స్థానిక రహదారులపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

దారి సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు మరియు భారీ వాహనాల డ్రైవర్లు ఉదయం వేళల్లో సైతం హెడ్‌లైట్లు వేసుకుని అతి నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. మంచు తీవ్రత దృష్ట్యా రహదారులపై వెళ్లే వాహనదారులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI