Kakinada: ఉప్పొంగిన సుద్దగడ్డ వాగు.. నీట మునిగిన పంట పొలాలు!

Kakinada: కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సుద్దగడ్డ వాగు ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో నష్టంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

RAMA KRISHNA, KKD
Published on: 25 Sept 2026 1:03 PM IST
Kakinada
X

Kakinada: ఉప్పొంగిన సుద్దగడ్డ వాగు.. నీట మునిగిన పంట పొలాలు!

Kakinada: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంగా కురుస్తున్న భారీ వర్షాలకు గొల్లప్రోలులో సుద్దగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పొలాల్లో ఉన్న పంటలు నీటిలో మునిగిపోవడంతో పంటలు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. వర్షాలు మరింత కొనసాగితే ముంపు తీవ్రత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ముంపు ప్రాంతాలను పరిశీలించి, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD