Samarlakota: సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జ్వాలా తోరణం!
Samarlakota: కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మహోత్సవం పురస్కరించుకుని జ్వాలా తోరణం వేడుకలు ఘనంగా జరిగాయి.
Samarlakota: సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జ్వాలా తోరణం!
సామర్లకోట: సామర్లకోట పంచరామ క్షేత్రం శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో భీమేశ్వర స్వామి ఆలయం వద్ద జ్వాలా తోరణం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పవిత్ర కార్తీక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ఛైర్మన్ కంటే జగదీశ్ మోహన్ అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్నశర్మ, సత్య నారాయణమూర్తి, రాజగోపాల్ శర్మ ఆధ్వర్యంలో బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి పూజలు చేసి, రథోత్సవం చేశారు.
జ్వాలా తోరణం కింది నుంచి ముమ్మారు పల్లకి ప్రదక్షిణ జరిగింది.కార్తీక మాసం మహా పర్వదినాలు పురస్కరించుకుని ఆలయ ఈవో బల్ల నీలకంఠం, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించి ప్రత్యేక పూజల్లో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, జడ్పీ చైర్మన్ బుర్ర దివ్య రాజ్,, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ వల్లూరి సూర్యప్రకాశ్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు గోదావరి హారతి,ఆకాశ దీపం,జ్వాల తోరణం కార్యక్రమాలను చేపట్టగా భక్తులు ఉదయం నుండి ఉపవాసం ఆచరించి సాయంత్రం భీమేశ్వర స్వామి వారిని,బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.




