Kakinada: ఆర్టీసీ బస్సులో సీటు వివాదం: మహిళలపై రాడ్లతో దాడి!

Kakinada: ఏలేశ్వరం మండలం చిన్నంపేట హైవేపై ఆర్టీసీ బస్సులో మహిళలపై 30 మంది మూకుమ్మడిగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 18 Oct 2026 12:26 PM IST
Kakinada
X

Kakinada: ఆర్టీసీ బస్సులో సీటు వివాదం: మహిళలపై రాడ్లతో దాడి!

కాకినాడ: తుని నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టిసి బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై యువకులు దాడి. ముగ్గురికి గాయాలు. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇద్దరు మహిళల పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కాకినాడ తరలింపు. బస్సులో సీటు విషయంలో సిరిపురం రాజమండ్రి కి చెందిన మహిళల మధ్య చెలరేగిన వివాదం.

భర్తకు ఫోన్ చేసి నన్ను కొట్టారంటూ ఫోన్ చేసి చెప్పిన సిరిపురం కు చెందిన మహిళ. దీంతో సిరిపురం గ్రామానికి చెందిన 30 మంది యువకులతో చిన్నంపేట హైవేపై బస్సు కోసం కాపు కావాల్సిన భర్త. ఆర్టీసీ బస్సు చిన్నంపేట రాగానే తన భార్యపై గొడవ పడిన వారిపై యువకులతో కలిసి విచక్షణ రహితంగా కర్రలు, రాడ్డులతో దాడి. దాడిలో రాజమండ్రి కి చెందిన ఒక వ్యక్తికి ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు.

భయభ్రాంతులకు గురైన బాధితులు 112 పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసిన బాధితులు. ఏలేశ్వరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే అక్కడ నుంచి వెళ్లిపోయిన చిన్నంపేటకు చెందిన మహిళ ఆమె భర్త. బస్ డ్రైవర్ కండక్టర్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్న ఏలేశ్వరం పోలీసులు. తమపై దాడి చేసిన వారిలో కొంతమంది మద్యం ,గంజాయి సేవించి ఉన్నారని ఆరోపిస్తున్న బాధితులు.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU