Kakinada: స్వచ్ఛ ఆంధ్ర అవార్డును గెలుచుకున్న మంగయ్యమ్మరావుపేట యూపీహెచ్‌సీ
Kakinada: కాకినాడ జిల్లాలో పిఠాపురం మంగయ్యమ్మరావుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ స్వచ్ఛ ఆంధ్ర అవార్డుకు ఎంపికైంది. కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న వైద్యాధికారి.
Kakinada: స్వచ్ఛ ఆంధ్ర అవార్డును గెలుచుకున్న మంగయ్యమ్మరావుపేట యూపీహెచ్‌సీ
కాకినాడ: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల విభాగంలో పిఠాపురం మంగయ్యమ్మరావుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) స్వచ్ఛ ఆంధ్ర అవార్డుకు ఎంపికైంది.
ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల బహుకరణ కార్యక్రమంలో కాకినాడ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మరియు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మంగయ్యమ్మరావుపేట యూపీహెచ్ సి వైద్యాధికారి డా. వై. వినయ్ స్వచ్ఛ ఆంధ్ర అవార్డును అందుకున్నారు.
ఈ అవార్డు లభించడంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. అనిత , డి ఐ ఓ సుబ్బరాజు , డీ ఎం ఓ డా.ప్రభాకర్ , డీ పీ ఎం ఓ .లక్ష్మీ మరియు కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేసి, డా. వై. వినయ్ గారికి, UPHC సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. వై. వినయ్ మాట్లాడుతూ, “ఈ అవార్డు రావడంతో నా మీద, మా సిబ్బందిపై బాధ్యత మరింత పెరిగింది. ఆసుపత్రి అభివృద్ధికి నేను, నా సిబ్బంది ఎల్లప్పుడూ సమిష్టిగా కృషి చేస్తాం” అని తెలిపారు.




