Kakinada: కత్తిపూడిలో ఘనంగా ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం

Kakinada: కాకినాడ జిల్లా కత్తిపూడిలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో 'పేదల సేవలో 2.0' కార్యక్రమం ఘనంగా జరిగింది.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 1 Oct 2026 7:06 PM IST
Kakinada
X

Kakinada: కత్తిపూడిలో ఘనంగా ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం

కాకినాడ: కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పేదలు,అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను మరింత చేరువ చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పేదల సేవలో కార్యక్రమం ప్రతినెల 1వ తేదీన చేపట్టడం జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలవల్ల ఆయా కుటుంబాలకు మేలు జరుగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న శివ, అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు పర్వత సురేష్, పాల్గొన్నారు..

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU