Kakinada: కాకినాడలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

Kakinada: కాకినాడ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు 2 కేంద్రాలు, 306 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడి.

V. Ramakrishna, Pithapuram
Published on: 6 Nov 2026 7:31 PM IST
Kakinada
X

Kakinada: కాకినాడలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

కాకినాడ: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ రెండవ సాధారణ ఎన్నికలు– 2026కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గ దర్శకాలు,నిబంధనల కు అనుగుణంగా పారదర్శ కం గా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కాకినాడ జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ ల పరిధి లో మొత్తం 20 మండలాల కు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహణ కోసం రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కాకినాడ కౌంటింగ్ కేంద్రం: పి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పెదపూడి, కాజులూరు, కరప, తాళ్లరేవు,కాకినాడ రూరల్, పిఠాపురం,యు. కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలతో పాటు పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని సామర్ల కోట,తొండంగి మండలాలకు సంబంధించి మొత్తం 10 మండలాల ఓట్ల లెక్కింపు కోసం కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కేంద్రంలో ఓట్ల లెక్కింపు సజావుగానిర్వహించేందుకు మొత్తం 160 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పెద్దాపురం కౌంటింగ్ కేంద్రం: మహారాణి కళాశాలలో పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గండే పల్లి,జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని,శంఖవరం, ఏలేశ్వరం,కిర్లంపూడి, రౌతులపూడి,కోట నందూరు, పెద్దాపురం మండలాలకు సంబంధించి మొత్తం 10 మండలాల ఓట్ల లెక్కింపు కోసం పెద్దాపురం లోని మహారాణి కళాశాల లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.

ఈ కేంద్రంలో ఓట్ల లెక్కింపు నిర్వహణకు మొత్తం 146 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు కౌంటింగ్ కేంద్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన మౌలిక సదుపాయాలు,భద్రతా ఏర్పాట్లు,అధికారుల విధుల కేటాయింపు తదితర అంశాలను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణం గా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

కౌంటింగ్ నిర్వహణకు 346 మందిసూపర్వైజర్లు, 978 టేబుల్ అసిస్టెంట్లు, ఇతర సహాయ సిబ్బంది 600 నియామకం

ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకతతో నిర్వ హించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని పగడ్బందీ గా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram