U Kothapalli: యు.కొత్తపల్లిలో తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిశీలన: జేసీ

U Kothapalli: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట తీరప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పర్యటించి సమీక్షించారు.

RAMA KRISHNA, KKD
Published on: 24 Sept 2026 8:37 PM IST
U Kothapalli
X

U Kothapalli: యు.కొత్తపల్లిలో తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిశీలన: జేసీ

U Kothapalli: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావిత మవుతున్న ప్రాంతాలను గురువారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పర్యటించారు.

ఈ సందర్భంగా జేసీ యు. కొత్తపల్లి మండలం సుబ్బంపేట వద్ద సముద్ర తీర ప్రాంతాన్ని, అక్కడ ఉన్న జనవాసాలను క్షేత్రస్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి తుఫాన్ తీరం దాటినప్పటికీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులు.. ప్రభావితమయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని జేసీ ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు.

ఈ పరిశీలనలో జేసీ వెంట యు.కొత్తపల్లి తహసీల్దార్ చిన్నారావు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD